Ram Charan : ఆ మాట అడగడానికి ధైర్యం సరిపోలేదు..! 2 d ago
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన "గేమ్ ఛేంజర్" మూవీ జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై లో ఈ మూవీ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్లు. రామ్ చరణ్ మాట్లాడుతూ "శంకర్ గారు గొప్ప దర్శకుడు. 3 ఇడియట్స్ మూవీ ని ఆయన తమిళ్ లో రీమేక్ చేశారు. ఆ మూవీని తెలుగులో 'స్నేహితుడు' అనే టైటిల్ తో రిలీజ్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాను. ఆయన పక్కన కూర్చున్నపుడు "తెలుగు హీరోలతో ఒక సినిమా చేయమని అడుగుదామనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు అంత ధైర్యం సరిపోలేదు. కొన్నేళ్ల తర్వాత RRR మూవీ షూట్ చివరి దశలో ఉన్నపుడు నిర్మాత దిల్ రాజు నుంచి నాకు ఫోన్ వచ్చింది. శంకర్ నీతో వర్క్ చేయాలనుకుంటున్నారు అని చెప్పాడు. మొదట నిజం అనుకోలేదు.. నిజం అని తెలిసాక నా కల నెరవేరిందని భావించా. లార్జర్ దెన్ లైఫ్, కమర్షియల్ చిత్రాలను భారీస్థాయి లో తెరకెక్కించడంలో ఆయన మాస్టర్. రాజమౌళి, శంకర్ వంటి గొప్ప దర్శకుల సినిమాల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇద్దరు టాస్క్ మాస్టర్లే" అని చరణ్ తెలిపారు.